Header Banner

భారత నేవీ త్రిశూల శక్తి! పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా!

  Sat May 03, 2025 17:59        India

విధ్వంసక నౌక, అధునాతన తేలికపాటి హెలికాప్టర్, జలాంతర్గామి ఓ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఫొటోను నేవీ ఎక్స్లో పంచుకుంది.

 

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam_Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం (Indian Navy) సముద్రంలో గస్తీ కాస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది. అందులో ఒక నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ దర్శనమిచ్చాయి. అవి.. ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH), స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి.

 

"భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా” అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. 'Anytime Anywhere Anyhow' జోడించింది. ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలను కొన్నినెలల క్రితం నిలిపిశారు. దీన్నిబట్టి చూస్తే.. ఇది పాతచిత్రం కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఉగ్ర ఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 


ఇదిలాఉంటే.. పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక “ది రెసిస్టెన్స్ ఫ్రంట్' హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డివిరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధూజలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. ఇక, కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ (ALH Dhruv) కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్మీ (Indian Army), ఎయిర్ఫోర్స్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతివ్వలేదని తెలిసింది.

 

అత్యంత అధునాతనమైన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు భారత నౌకాదళంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాముల వేట, నిఘా సమాచార సేకరణ, సాగరజలాల్లో మందుపాతరలు అమర్చడం, నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి ఉంచడం వంటి కార్యకలాపాలు సాగించగలవు. ఫ్రాన్స్ తోడ్పాటుతో నిర్మించిన ఈ జలాంతర్గాములకు శత్రువుల నిఘా సాధనాలకు దొరకని రీతిలో అద్భుతమైన స్టెల్త్ లక్షణాలు ఉన్నాయి. టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించగలవు. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ కోల్కతా ప్రధాన డెస్ట్రాయర్. ఇది భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఇది ఒకటి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మదిరిగే షాక్! లిక్కర్ మాఫియాలో మరో నిందితుడు అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆల్ టైం రికార్డ్స్ సాధిస్తున్న అమరావతి! ఒకదానిని మించి మరొకటి.. నిర్మాణం మొదలు కాకముందే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndianNavy #INSKolkata #DhruvHelicopter #ScorpeneSubmarine #PahalgamAttack